చాలా మంది కోడిగుడ్డులోని తెల్లది ఆరగించి... లోపల ఉన్న పచ్చ సొనను పారేస్తుంటారు. దీనికి కారణం... ఈ పచ్చ సొన తినడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుందనీ, రక్తనాళాలను మూసివేస్తుందని, బరువు పెరుగాతన్న భ్రమలో చాలా మంది ఉంటారు. నిజంగా ఈ పచ్చ సొన తినడం మంచిదా కాదా అనే విషయాన్ని తెలుసుకుందాం.
పచ్చసొనను తినకపోవడం వల్ల ముఖ్య పోషకాలైన కొలైన్, సెలీనియం, జింక్‌తోపాటు విటమిన్ ఎ, బి, ఇ, డి, కె కూడా కోల్పోతారు. బి కాంప్లెక్స్, విటమిన్ డిలకు ప్రధాన వనరుగా గుడ్డును పేర్కొంటారు. పచ్చసొనలో ఐరన్ శాతం అధికం. దాన్ని మన శరీరం సులువుగా గ్రహిస్తుంది.