రోజూ అరగంట పాటు వ్యాయామం చేయండి.. క్యాన్సర్‌ను దూరం చేసుకోండి

బుధవారం, 24 ఆగస్టు 2016 (11:42 IST)
అరగంట పాటు వ్యాయామం చేయండి క్యాన్సర్లను దూరం చేసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి 150 నిమిషాలు.. అంతకంటే ఎక్కువసేపు వ్యాయామం చేసే స్త్రీలకు గర్భాశయ గోడల్లో తలెత్తే ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ ముప్పు 34% తగ్గుతున్నట్టు పరిశోధనలో వెల్లడి అయ్యింది.

రోజుకు కనీసం 30 నిమిషాల సేపు వ్యాయామం చేయటంతో పాటు కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవటం వంటి మంచి అలవాట్లతో 23శాతం వరకు క్యాన్సర్లను దూరం చేసుకోవచ్చు. 
 
ఆడుకోవడం వంటి వినోదభరిత వ్యాయామాలు చేసే పురుషులకు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు.. అలాగే ఈ క్యాన్సర్‌తో మరణించే ముప్పు తగ్గుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. రోజూ కనీసం ఒక మాదిరి వ్యాయామం చేసినా కూడా జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పు 50శాతం వరకు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  

వెబ్దునియా పై చదవండి