నెయ్యిని తీసుకోవడం ద్వారా... శరీరానికి కావల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే తప్పనిసరిగా నెయ్యి తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాల్లో నెయ్యి చేర్చుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వీటిలో ఏ ఆహార పదార్థాలను కలుపుకుని తినవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు, నెయ్యి: ప్రతిరోజూ ఒక చెంచా పసుపును దేశీ నెయ్యితో కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అంతే కాకుండా నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో వాపులు, నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అల్లం పొడి నెయ్యి: అల్లం పొడినినెయ్యితో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. దీనితో పాటు పేరుకుపోయిన కఫం కూడా సులభంగా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కడుపునొప్పి, వాపు, తలనొప్పి సమస్యలతో బాధపడేవారు రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.