గోంగూరను వారానికోసారి డైట్‌లో చేర్చుకుంటే?

శనివారం, 14 అక్టోబరు 2017 (10:33 IST)
గోంగూర అంటే తెలియని తెలుగువారంటూ వుండరు. గోంగూర పచ్చడి అంటేనే చాలామందికి నోరూతుంది. అలాంటి గోంగూరలో ఉండే పీచు పదార్థం గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉన్నాయి. పొటాషియమ్‌, కాల్షియమ్‌, ఫోస్పర్స్, సోడియం, ఐరన్ సమృద్థిగా ఉన్నాయి. దీనిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రైట్స్ అధికంగా ఉండి కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 
 
అంతేగాకుండా ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా వుండటం ద్వారా రక్త ప్రసరణ సక్రమంగా వుండటమే కాకుండా రక్తపోటును కూడా అదుపులో వుంచుతుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్‌ని గోంగూర తగ్గిస్తుంది.
 
కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్థులు గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించుకోవచ్చు. ఇంకా గోంగూరను వారానికోసారి తీసుకోవడం ద్వారా దగ్గు, ఆయాసం తగ్గిపోతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు