బంగారు రంగుతో చూడటానికి అందంగా, తియ్యగా, మంచి వాసనతో ఉండే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా మందులలో వాడుతారు. సాధారణంగా చెరకు రసం నుంచి బెల్లాన్ని తయారుచేస్తారు. తాటి నుంచి కూడా బెల్లం తయారవుతుంది. బెల్లంలో పంచదార లాగా పెద్దగా రసాయనాల వాడకం ఉండదు. పైగా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల నుంచి 350 గ్రాముల శక్తిని, 95 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 55 గ్రాముల కాల్షియం, 40 గ్రాముల పాస్పరస్, 2.6 మిల్లీ గ్రాముల ఐరన్ బెల్లంలో దొరుకుతుంది.
బెల్లంలోని యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, రోగనిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ ఇన్ఫెక్షన్లను వ్యతిరేకంగా పోరాడుతాయి. బెల్లంలో పుష్కలంగా లభించే ఐరన్, ఫ్లోరిక్ యాసిడ్‌లు మహిళల్లో రక్తహీనతను నివారిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. బెల్లం గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బెల్లం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉండి జ్ఞాపకశక్తి బాగా పనిచేస్తుంది.