మైదాపిండితో ఆరోగ్యానికి కీడు తప్పదు. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతోకొంత పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచుపదార్థం జీరో. కాబట్టి మైదా త్వరగా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుపోతుంది. దీనివల్ల పేగుల్లో పుండ్లు పడే ప్రమాదం ఉన్నది. అవి ముదిరితే క్యాన్సర్ లాంటి తీవ్రమైన ప్రాణాంత వ్యాధులకు దారితీస్తాయి.