దేవుడిపై భక్తితో ఉపవాసం మంచిదేనా?

బుధవారం, 22 మార్చి 2017 (12:11 IST)
చాలా మంది యువతులు లేదా మహిళలు దేవుడిపై భక్తితో ఉపవాసాలు ఉంటారు. మరికొందరు బరువు తగ్గాలన్న ధ్యాస కావొచ్చు... డైటింగ్‌లు చేస్తుంటారు. భక్తి కావొచ్చు.. సన్నబడాలన్న ఆలోచన కావొచ్చు... కారణమేదైనా కడుపు మాడ్చటం మంచిది కానే కాదని ఆహార వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఆహారం తీసుకోకపోతే దానికి బదులు ఏదో ఒకటి తగు మోతాదులోనైనా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఏదీ తినకుండా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయని అంటున్నారు. అందువల్ల ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా మానేయడం మంచిది కాదని అంటున్నారు. 
 
బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల ఆకలి పెరిగిపోయి ఆ తర్వాత ఎక్కువ కేలరీలు తీసుకునేందుకు దారితీస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునేవారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల బరువు తగ్గాలన్న ఆలోచనతో డైటింగ్ చేయాలనుకునేవారు తమ ఆలోచనలు మానుకుని కొంచెం పరిమాణంలో ఆహారాన్ని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి