వేసవి రాగానే మనకు రోడ్ల పక్కనే తాటి ముంజలు అమ్మేవారు కనబడుతుంటారు. ఈ తాటి ముంజల్లో విటమిన్ బి7, విటమిన్ కె, సోలెబుల్ ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, జింక్, ఐరన్‌లతో పాటు న్యూట్రిన్స్ ఉంటాయి. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాం.
* తాటి ముంజల్లో ఉండే పోషకాలు జీర్ణ సంబందిత సమస్యను తగ్గిస్తాయి. వీటిని తినడం వలన తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటి, కడుపు ఉబ్బరంగా ఉండే ఉదర సంబందిత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
* వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే శరారంలోని అధిక బరువుని తగ్గించేందుకు తాటి ముంజలు ఎంతో సహాయపడతాయి.