సౌందర్యానికి బీట్ రూట్ అద్భుతంగా పనిచేస్తుందట. విటమిన్ బి ఉండే బీట్‌రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది.
రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది.