రోజుకో గ్లాసు పాలు తాగితే బరువు పెరగరని.. రోజూ కనుక పాలు తాగితే బరువు పెరగడాన్ని నియంత్రించవచ్చునని వైద్యులు చెప్తున్నారు. పాలు తాగే వారిలో కాన్యర్ కారకాలు నశిస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. చిన్నప్పటి నుండి పాలు తాగే అలవాటు ఉన్న వారిలో రొమ్ము కేన్సర్ కలిగే అవకాశాలు తక్కువేనని వైద్యులు చెప్తున్నారు.
పాలల్లో ఉండే క్యాల్షియం.. సహజ సిద్ధమైన కొవ్వు.. కాన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతుంది. రోజూ గ్లాసుడు పాలు తీసుకునే వారిలో టైప్-2 డయాబెటిస్ వ్యాధి గురయ్యే అవకాశాలు చాలా తక్కువని తేలింది. తక్కువ ఫ్యాట్ గల పాలలో గ్లైసిమిక్ స్థాయిలు తక్కువగా ఉండటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయిలో ఉండటమే దీనికి కారణమని చెప్పారు.
పాలల్లోని క్యాల్షియం వంటి ఇతరత్రా ధాతువులు గుండె జబ్బులను దూరం చేస్తుంది. పాలలో ఉండే కాల్షియం శరీరంలో ఉండే చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తుంది. కండరాలు, దంతాలు, ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజు గ్లాసుడు పాలు సేవించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.