కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన గుమ్మడి నర్సయ్య మోషన్ పోస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గుమ్మడి నర్సయ్య పాత్రలో శివ రాజ్ కుమార్ ఎలా కనిపిస్తారు? ఏ మేరకు ఆకట్టుకుంటారు? అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేశారు. గుమ్మడి నర్సయ్య పాత్రకు శివన్న ప్రాణం పోసేందుకు సిద్దంగా ఉన్నారని అర్థమైంది. ఆ పాత్రకు తగ్గ ఆహార్యంతో శివన్న అందరినీ ఆకట్టుకున్నారు. చిన్న మోషన్ పోస్టర్‌తోనే దర్శకుడు పరమేశ్వర్ తన టాలెంట్ ఏంటో చూపించారు. ఇక ఈ మోషన్ పోస్టర్‌ను చూసిన శ్యామలా దేవీ గారు దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు.
మోషన్ పోస్టర్ గురించి శ్యామలా దేవీ గారు మాట్లాడుతూ .. ఎక్సలెంట్‌గా ఉంది.. ఈ మోషన్ పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది.. ఎన్ని అవార్డులు వస్తాయో తెలుస్తోంది.. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ గారు ప్రాణం పెట్టి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించబోతోన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బిలి, ఎడిటర్‌గా సత్య గిడుటూరి పని చేస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన ఇతర ఆర్టిస్టులకి సంబంధించిన విషయాల్ని ప్రకటించనున్నారు.