SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

చిత్రాసేన్

సోమవారం, 3 నవంబరు 2025 (18:30 IST)
SSMB 29 poster
ఎస్.ఎస్. రాజమౌళి, మహేబాబు సినిమా ఎస్.ఎస్.ఎం.బి.29 సినిమా గురించి తాజా అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈలోగా రాజమౌళి తన పాత సినిమా బాహుబలి రీరిలీజ్ పనిలో వున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం ఒడిసాలోని కోరాపూడ్ జిల్లాలో షూట్ చేశారు. ప్రస్తుతం అక్కడ మరలా కొనసాగించాలంటే తుఫాన్ వల్ల సాధ్యపడడంలేదని తెలుస్తోంది. ఇటీవలే ఎక్స్ లోె కొన్ని ఫన్నీ వీడియోను విడుదల చేశారు.
 
ఇందులో రాజమౌళి, మహేష్ బాబు, ప్రధ్వీరాజ్ కుమారన్, ప్రియాంక చోప్రా చాట్ లో పాల్గొన్నారు. నవంబర్ నెల వచ్చేసింది రాజమౌళి అంటూ మహేష్ అడిగితే.. అవును. ఏ సినిమాకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావ్ అంటూ సరదాగా రాజమౌళి ప్రశ్నించారు.
మీరు ఎప్పటినుంచో తయారుచేస్తున్న మహాభారతం గురించి ఇద్దామని అంటూ పంచ్ వేసి, నవంబర్ లో మాకు హామీ ఇచ్చారు. మీరు మాట నిలబెట్టుకోండని మహేష్ అన్నారు.
ఇద్దాం ఒక్కోటిగా నిదానంగా ఇద్దామంటూ రాజమౌళి అనగానే.. నెమ్మదిగా అంటే 20230కు మొదలుపెడతామా? అంటూ సెటైర్ వేశారు మహేష్.ఇప్పటికే ప్రియాంక హైదరాబాద్ వీధులన్నీ తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసిందంటూ.. టాపిక్ ఆమెపైకి తిప్పాడు. ఇలా అందరూ సరదాగా మాట్లాడిన వీడియో విడుదలైంది.
 
ఇక దానిని చూశాక రాయలసీమ మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ సరికొత్త పోస్టర్ ను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ, మహేష్ పరుగుడెతున్నట్లు చుట్టూ జంతువులు, పక్షులతో ఎదురుగా భారీ మేఘం లాంటి ఆకారం కనిపిస్తుంది. సినిమా కథకూడా అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యం గనుక సరికొత్తగా వుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు