ఆల్‌బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
1. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్‌సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు తోడ్పడతాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. జ్యూసీగా ఉండే ఈ పండులో కేలరీలు తక్కువ. జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
2. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఇది మనకెంతగానో తోడ్పడుతుంది. విటమిన్ ఎ, బీటా కెరోటిన్‌లూ ఇందులో ఉన్నాయి. దీనిలో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా కాపాడుతుంది.