సలార్ 2 తప్పనిసరిగా వుంటుందని ఆయన అన్నారు. అంతేకాక ప్రభాస్ తో తమకున్న అనుబంధంలో మూడు సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా విజయ్ మాట్లాడుతూ, అసలు బడ్జెట్ తో సంబంధంలేదు. క్వాలిటీతో కూడిన కంటెంట్ సినిమాలకు పెద్ద పీఠవేస్తామని, అందుకు తగిన విధంగా సినిమాలు నిర్మిస్తామనీ, దానికి తగువిధంగా హాలీవుడ్ స్థాయిలోని సాంకేతికతను ఉపయోగించుకుంటామని తెలిపారు.
దీనిపై ప్రభాస్ మాట్లాడుతూ "కిరగందూర్ గారి అభిరుచి, నిర్మాణ సంస్థను మిగతా వాటి నుండి ప్రత్యేకంగా నిలబెట్టింది" అని అన్నారు. "అతను ప్రేక్షకులను, తన సిబ్బందిని జాగ్రత్తగా చూసుకునే విధానం కూడా అంతే బాగుంది. అతను చాలా సాఫ్ట్ గా ఉంటాడు, అన్ని విషయాల్లో స్థిరంగా ఉంటాడు. అందుకే మేము కుటుంబంలా మారాము, మేము కలిసి సినిమాలు ప్లాన్ చేస్తున్నాము." అని వివరించారు.