గుండెపోటుకి చెక్ పెట్టేందుకు.. ఈ చిట్కాలు పాటిస్తే...?

గురువారం, 4 అక్టోబరు 2018 (14:54 IST)
గుండెపోటు వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికిపడితే వారికి వస్తుంటుంది. ఈ గుండెపోటుని  నివారించుటకు ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

ఒత్తిడి సమస్యలను 50 శాతం వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే మానసిక సమస్యల వలన గుండెపోటు వస్తుంటుంది. కనుక ఆలోచనలను దూరంగా ఉండాలి. శరీరంలోని కొవ్వు శాంత 130 మి.గ్రా ఉండేలా చూసుకోవాలి.

ఈ కొవ్వు వలన గుండెపోటు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలోని విటమిన్స్, న్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పదార్థాలు ఈ ప్రమాదం నుండి ఉపశమనం కలిగిస్తాయి. 
 
బీపీ మాత్రం 120 నుండి 80 వరకు ఉండాలి. ఒకవేళ హైబీపీ 130 నుండి 90 వరకు పెరిగితే మాత్రం తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అందువలన వీలైనంత వరకు వ్యాయామం చేయడం మంచిది. తద్వారా అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు