ఏ నెలలో ఏ పండ్లను తీసుకోవాలో తెలుసా..?

బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:27 IST)
ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కి ముందుగా పండ్లు తీసుకుంటే అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజూ తీసుకునే ఆహారంలో 5 శాతం పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇది ఇలా ఉంటే ఏ నెలలో ఏ పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.
 
* జనవరి నెలలో స్ట్రాబెర్రీ, ద్రాక్ష, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్.
* ఫిబ్రవరి నెలలో సపోటా, తర్బూజా, ద్రాక్ష, నారింజ, జామ, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్, స్ట్రాబెర్రీ.
* మార్చి నెలలో పుచ్చకాయ, పచ్చి మామిడి, ద్రాక్ష, నారింజ, పైనాపిల్, అరటిపండు, తర్బూజా, స్ట్రాబెర్రీ.
* ఏప్రిల్ నెలలో పనస పండును తీసుకుంటే మంచిది. 
* మే నెలలో మామిడి, పచ్చి మామిడి, బొప్పాయి, నేరేడు, లిచీ, పనస, పుచ్చకాయ, తర్బూజా. 
* జూన్ నెలలో మామిడి పండ్లు తీసుకోవాలి. 
* జూలై నెలలో చెర్రీలు, మామిడి పండ్లు తీసుకోవాలి. 
* ఆగస్టు నెలలో సీతాఫలాలు, మామిడి పండ్లు.
* సెప్టంబర్ నెలలో బొప్పాయి, దానిమ్మ, సీతాఫలాలు.
* అక్టోబరు నెలలో బొప్పాయి, దానిమ్మ.
* నవంబరు నెలలో నారింజ, కర్జూరం, జామ, బొప్పాయి, దానిమ్మ, సీతాఫలం.
* డిసెంబరు నెలలో నారింజ, నిమ్మ, జామ, సీతాఫలం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు