వారంలో ఐదు రోజులు యాపిల్స్, గ్రేప్స్, ఆనియన్స్, వైన్, టీ, డార్క్‌చాక్లెట్లను తీసుకుంటే యాంటీయాక్సిటెండ్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే తాజా కూరగాయలు, తాజా ఆకుకూరలను కూడా వారంలో రెండు, మూడుసార్లైనా తీసుకోవాలి. బ్రోకోలీ, క్యాలీఫ్లవర్ అధికంగా తీసుకుంటే మెదడు పనితీరు మెరుగవుతుంది.
అలాగే ఆలివ్ ఆయిల్, నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఆవకోడా వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో యాంటీయాక్సిడెంట్లు, విటమిన్-ఇ పుష్కలంగా వుంటుంది. ఇది అల్జీమర్స్‌ను దూరం చేస్తుంది. అలాగే వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.