ప్రతిరోజు అరటిపండును తీసుకోవడం ద్వారా లివర్‌ను శుభ్రం చేసేందుకు సహాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అరటి పండులో ఉండే కెరొటినాయిడ్స్ లివర్‌ను కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో క్యాన్సర్ కారకాలపై పోరాడే శక్తి అధికంగా ఉంటుంది. దృష్టి లోపాలను అరికట్టడంలో అరటిపండు చాలా ఉపయోగపడుతుంది.
అరటిపండులోని ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. హృద్రోగాలను దూరం చేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. కిడ్నీకి కూడా అరటిపండు ఎంతో ఉపయోగపడుతుంది. బీపీని నియంత్రించడంలో అరటిని మించిన దివ్యౌషధం లేదు.
అరటిపండ్లను స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పెరుగు, బనానా స్మూతీలా చేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చును. సాయంత్రం పూట ఉడికించిన తృణధాన్యాలతో పాటు అరటిపండ్ల ముక్కలను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు.