అలోవేరా జ్యూస్ తాగితే ఏమవుతుంది?

మంగళవారం, 24 జనవరి 2023 (23:02 IST)
అలోవెరా లేదా కలబందను సౌందర్య సాధనంగా బాగా వాడతారు. ఐతే అలోవేరాలో సౌందర్యంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
కలబంద మధుమేహాన్ని నియంత్రించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
కలబంద లోని ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ పుష్కలంగా ఉండే రక్తకణాలు, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది.
 
శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు కలబందలో ఉన్నాయి.
 
జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను వెలుపలికి నెట్టేసే సహజ గుణం అలోవెరాలో ఉన్నాయి. 
 
యాంటి బయాటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్‌లో ఉంది.
 
మధుమేహ రోగుల ఆహార నియంత్రణ వలన ఏర్పడే పాదాలలో తిమ్మిర్లు తదితర సమస్యలను నివార్తింది.
 
వేసవిలో అలోవెరా ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం పొందవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు