నిర్లక్ష్యం.. తెలియక ఏసీ భోగీలోకి ఎక్కి కింద దిగబోయాడు.. ఇంతలో కాలుజారింది.. చివరికి? (video)

సెల్వి

మంగళవారం, 28 అక్టోబరు 2025 (15:17 IST)
Kachiguda Station
నిర్లక్ష్యం కారణంగా రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రమాదాలు జరుగుతుండటం చూస్తూనే వున్నాం. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఎన్నో వున్నాయి. తాజాగా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి పెను ప్రమాదం నుంచి గట్టెక్కాడు. వివరాల్లోకి వెళితే.. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతూ కాలుజారి ఓ వ్యక్తి కిందపడిపోయాడు. 
 
కానీ వెంటనే స్పందించిన ప్రయాణీకులు రైల్వే సిబ్బంది అతనిని కాపాడారు. కొంచెం అటు ఇటు అయితే ఆ వ్యక్తి ప్రాణాలు పోయేవని అధికారులు తెలిపారు. వరంగల్‌కు చెందిన మణిదీప్ అనే యువకుడు బెంగళూరు వెళ్లేందుకు కాచిగూడకు చేరుకున్నాడు. టికెట్ తీసుకుని అవసరంలో ఏసీ ఫస్ట్ క్లాస్ భోగీలో ఎక్కేశాడు. అయితే రైలు కదులుతుండగా కిందకు దిగేశాడు. దీంతో అతడి కాలు జారి రైలు కిందపడిపోయాడు. 
 
అయితే అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీఎస్ కానిస్టేబుల్ సుస్మిత, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గోవిందరావు, తోటి ప్రయాణీకులు అతడిని పక్కకు లాగి రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణీకుడిని కాపాడిన రైల్వే ఉద్యోగులను నెటిజన్లు, స్థానికులు, రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.

కాచిగూడలో తృటిలో తప్పిన రైలు ప్రమాదం

బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ స్టేషన్‌కు వచ్చిన మణిదీప్, తప్పు బోగీలోకి ఎక్కి, రన్నింగ్ ట్రైన్ నుండు దిగే సమయంలో రైలులో నుండి జారిపడ్డాడు.​

ACM గోవింద్ రావు, RPF సుస్మిత వెంటనే స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. pic.twitter.com/cTyGggq94j

— greatandhra (@greatandhranews) October 28, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు