నోటి దుర్వాసన. ఈ సమస్యతో పలువురు ఇబ్బంది పడుతుంటారు. నలుగురు కలిసిన చోట మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఐతే చిన్నచిన్న చిట్కాలతో నోటి దుర్వాసన రాకుండా అడ్డుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పుష్కలంగా నీరు తాగాలి. మంచినీరు నోటి లోపల క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది నోటి దుర్వాసనను అరికడుతుంది. సోంపు తీసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. నోటి దుర్వాసనను నిరోధించి క్రిములను నాశనం చేస్తుంది.