పరోటా తింటున్నారా.. అయితే మధుమేహం ఖాయం అంటున్నారు వైద్యులు. ఇందుకు కారణం అందులో వాడే మైదానే. ప్రపంచంలో ప్రస్తుతం విస్తృతంగా కనిపిస్తున్న మధుమేహం నియంత్రణకు ఆహారపు అలవాట్లు, వ్యాయామం అవసరమని వైద్యులు చెప్తున్నారు.
అయితే అత్యధిక భారతీయులు మధుమేహం బారిన పడేందుకు ప్రధాన కారణం పరోటాలను ఎక్కువగా తీసుకోవడమేనని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది.
ఉత్తర భారత దేశం కంటే దక్షిణ భారత దేశంలోని పలు హోటళ్లలో పరోటా డిష్ తప్పనిసరిగా వుంటుంది. వీటిని ఇష్టపడి తినే వారే అధికం. పరోటాలో మానవులకు మధుమేహ వ్యాధి ఏర్పడటానికి అవసరమైన 70 శాతం ఆహార పదార్థాలు ఇందులో వున్నాయని పరిశోధనలో తేలింది.
అంతేగాకుండా రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతూ, కిడ్నీని దెబ్బతీసే పరోటాలను తీసుకోకపోవడమే మంచిదని.. ఇది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.