బరువును తగ్గించడమే కాకుండా.. సౌందర్య పోషణలోనూ వేడి నీరు బాగా పని చేస్తుంది. శరీరాన్ని తాజాగా కనిపించేలా చేయడంతోపాటు యాక్నె వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటితో చర్మం సాగేతత్వం పెరుగుతుంది. ముడతలు, పొడిచర్మం, నల్లటి వలయాలు వంటివన్నీ అదుపులో ఉంటాయి. వేడి నీళ్లకు కాస్త తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.
జలుబు, దగ్గు వంటి సమస్యలకు పరిష్కారంగానూ వేడినీటిని తీసుకోవచ్చు. శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం ఉంటుంది. ఒళ్లు నొప్పులుగా అనిపించినప్పుడు వేడినీళ్లు తీసుకుంటే రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఉపశమనం లభిస్తుంది.