పాలు కలపని టీ తాగితే ప్రయోజనం ఏంటి...?

బుధవారం, 14 నవంబరు 2018 (14:46 IST)
పాలు కలపని తేనీరు అంటే బ్లాక్ టీ మధుమేహానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనంలో తేలింది. బ్లాక్ టీ సేవించే వారిలో డయాబెటిస్ టైప్-2 వచ్చే అవకాశాలు చాలామటుకు తక్కువని అధ్యయనంలో వెల్లడైంది. డైలీ టైమ్స్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 50 దేశాల్లో అత్యధిక ప్రజలు పాలు కలపని బ్లాక్ టీని సేవిస్తున్నారు. ఈ దేశాల్లో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య ఇతర దేశాలకంటే తక్కువేనని అధ్యయనం తేల్చింది. 
 
ఇంకా బ్లాక్ టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓ వరప్రసాదమని పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. ఐర్లాండ్‌లో ఏడాది ఒక వ్యక్తి రెండు కిలోల బ్లాక్ టీ సేవిస్తున్నట్లు అధ్యయనం తేల్చింది. దీనికి తర్వాతి స్థానాల్లో బ్రిటన్, టర్కీలు సొంతం చేసుకున్నాయి. ఈ దేశాల్లో టైప్- 2 డయాబెటిస్ సోకిన వారి సంఖ్య చాలా తక్కువ అని తెలియవచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు