ఫ్రిడ్జిలో ఏ పండు ఎంతకాలం నిల్వ పెట్టవచ్చు?

సోమవారం, 19 జూన్ 2023 (16:40 IST)
మార్కెట్టు నుంచి పండ్లను తీసుకురాగానే చాలామంది వాటిని ఫ్రిడ్జిలో పెట్టేస్తారు. కానీ అవి ఎంతకాలం నిల్వపెట్టవచ్చనేది కొందరికి తెలియదు. ఏ పండును ఎంతకాలం నిల్వ వుంచుకోవచ్చో తెలుసుకుందాము. బొప్పాయి పండును ఫ్రిడ్జిలో 5 రోజుల నుంచి 7 రోజుల వరకూ స్టోర్ చేయవచ్చు.  పైనాపిల్ పండును ఫ్రిడ్జిలో 6 రోజుల కంటే ఎక్కువ నిల్వపెట్టకూడదు.
 
మామిడి పండ్లను 7 రోజుల నుంచి 14 రోజుల వరకూ ఫ్రిడ్జిలో వుంచవచ్చు. అవేమీ పాడవవు. రిఫ్రిజిరేటర్‌లో మొత్తం దానిమ్మలను ఉంచినట్లయితే, షెల్ఫ్ జీవితం రెండు నెలల వరకు ఉంటుంది. కానీ కట్ చేస్తే 2 రోజులే వుంటాయి. సపోటాలు పండినవి అయితే వారం రోజులు, పచ్చిగా వుంటే 10 రోజుల వరకూ నిల్వ వుంటాయి.
 
పుచ్చకాయలు కోసి ముక్కలు చేసినవి అయితే 2 రోజులు మించరాదు. స్ట్రాబెర్రీలను 3 నుంచి 5 రోజులు మాత్రమే నిల్వపెట్టుకోవాలి. అంతకుమించి వుంటే పాడయిపోతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు