బరువు తగ్గాలంటే స్కిన్ లెస్ చికెన్ తినండి..

శనివారం, 27 మే 2017 (15:46 IST)
బరువు తగ్గాలంటే.. తిండి తగ్గించాల్సిన అవసరం లేదు. పోషకాహారం తీసుకోవడం.. అది తేలికగా జీర్ణమయ్యేలా వుండేలా చూసుకోవాలి. నూనె పదార్థాలు, వేపుళ్లు, స్వీట్లు ఎక్కువగా తీసుకోకుండా.. ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకుంటే.. పాలకూర, కోడిగుడ్లు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
 
పాలకూర వంటి ఆకుకూరలు జీవక్రియల పనితీరును పెంచేందుకు ఉపయోగపడుతాయి. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ.. ఫ్యాట్స్ తక్కువకావడంతో సులభంగా బరువు తగ్గొచ్చు. ఇక కోడిగుడ్డులోని తెల్లసొనలో అమైనోయాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆహారాన్ని సులభంగా జీర్ణంకావడానికి సహాయపడతాయి. ఎగ్ వైట్‌లో ప్రోటీన్లు, విటమిన్ డి వుంటాయి. ఇవి బరువును తగ్గించడంలో సహకరిస్తాయి. 
 
వీటితో పాటు బరువు తగ్గాలంటే చేపలు తీసుకోవచ్చు. స్కిన్‌లెస్ చికెన్‌లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తద్వారా బరువు తగ్గుతారు. ఈ ఆహారంలో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తగినంత వుండేలా చూడటంలో ఇవి మెరుగ్గా పనిచేస్తాయి. ఇంకా బరువు తగ్గాలంటే రోజూ గ్లాసుడు పాలు, ముడి ధాన్యాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి