సాధారణా టీనేజర్లు, చిన్న పిల్లలు ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్‌కు లోనవుతుంటారు. వారి దినచర్యల్లో హాని కలిగించేలా ఎవరైనా ప్రవర్తించినా.. ఏదైనా సంఘటన చోటు చేసుకున్నా, ఏదైనా అనుకున్నది జరుగక పోయినా పూర్తి డిప్రెషన్‌కు లోనవుతుంటారు.
దీని నుంచి బయటపడాలన్న ఆలోచన వారికి ఉన్నప్పటికీ.. చాలా కష్టసాధ్యంగా మారుతుంది. అయితే, దీన్ని పెద్దలు ముందుగా గ్రహించి తగిన సూచనలు, సలహాలు, ఇవ్వడం వల్ల కొంతమేరకు బయటపడొచ్చు. అయితే పిల్లలు డిప్రెషన్‌కు లోనైన విషయాన్ని ఏ విధంగా కనుగొనవచ్చు. ఇందుకు మానసిక వైద్యులు, సైకలాజిస్టులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పిల్లల ప్రవర్తనను బట్టి వారు డిప్రెషన్ మూడ్‌లో ఉన్నారని గుర్తించవచ్చని అంటున్నారు.
టీనేజర్లు చాల త్వరగా ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకోవడం, అందరి మీదా విసుక్కోవడం చేస్తుంటే వారు డిప్రెషన్‌కి దగ్గరవుతున్నారని పెద్దలు గ్రహించాలి. కుటుంబ సభ్యులకీ, స్నేహితులకీ దూరంగా ఉంటూ, శుభకార్యాలలో పాల్గొనకుండా ఉంటే దానిని బిడియం అని భావించకండి. పిల్లలు తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఈ పరిస్థితి నుంచి వారిని సాధ్యమైనంత త్వరగా బయటకు తీసుకురావడానికి తల్లిదండ్రులు కృషి చేయాలని వారు చూపిస్తున్నారు.