చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్‌లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పండ్లు యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి.
ఓట్స్ కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. దీని ద్వారా రోజుకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ పొందవచ్చు. అవకాడోలో గుండె ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
బార్లీ, ఓట్స్ వంటివి గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గింజ ధాన్యాల వల్ల శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని తగ్గించుకోవచ్చు. బీన్స్‌లో ఫైబర్ ఎక్కువ, రకరకాల రూపాల్లో లభించే బీన్స్ తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గించుకోవచ్చు.