పండిన స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం.. కీళ్లు.. ఎముకలకు బలం..

గురువారం, 24 నవంబరు 2022 (18:35 IST)
పండిన స్ట్రాబెర్రీలను మాష్ చేయండి, చిటికెడు బేకింగ్ సోడా జోడించాలి. ఆపై టూత్ బ్రష్‌కు అప్లై చేయడం ద్వారా దంతాలను శుభ్రానికి బాగా ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
 
స్ట్రాబెర్రీలు మన శరీరంలోని గ్లూకోజ్ స్థాయిపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. స్ట్రాబెర్రీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, దీన్ని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. 
 
స్ట్రాబెర్రీలో ఉండే ఫైబర్ కూడా ఉదర సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీలలో విటమిన్-బి, సి పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
 
స్ట్రాబెర్రీలో ఉండే పొటాషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, అయోడిన్ ఎముకలు, కీళ్ల నొప్పిని దూరం చేస్తుంది. 
స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్-సి అనే ఎంజైమ్ కళ్లకు మేలు చేస్తుంది. 
 
ఇది సూర్యుని యూవీ కిరణాల నుండి రక్షించడం ద్వారా కళ్ళను అందంగా చేస్తుంది. స్ట్రాబెర్రీ చర్మాన్ని అందంగా మార్చడానికి, ముఖం ముడుతలను నివారిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు