టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ పుణ్యం.. మనిషి ఏకాగ్రత గోల్డ్‌ఫిష్ కంటే?
సోమవారం, 7 మే 2018 (15:33 IST)
టెక్నాలజీ పుణ్యంతో మనిషిలో ఏకాగ్రత కొరవడింది. తాజాగా ఓ అధ్యయనంలో మనిషి అటెన్షన్ గోల్డ్‌ఫిష్ కంటే తక్కువేనని తేలింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ప్రస్తుతం జనం ముందుకు కదలట్లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా దశాబ్దం క్రితం 12 సెకండ్లు ఉన్న అటెన్షన్ స్పాన్ క్రమంగా 8 సెకండ్లకు తగ్గిపోయింది.
ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే మానవుని అటెన్షన్ గోల్డ్‌ఫిష్ కన్నా తక్కువేనట. స్మార్ట్‌ఫోన్స్, టెక్నాలజీ వినియోగం పెరిగాక మానవుని అటెన్షన్ 12 నుంచి 8 సెకన్లకు పడిపోయింది. అయితే గోల్డ్‌ఫిష్ అటెన్షన్ విషయానికొస్తే 9 సెకండ్లుగా ఉంది.
ఈ అధ్యయాన్ని మైక్రోసాప్ట్ కార్పోరేషన్ నిర్వహించింది. రోజు వారి జీవితంలో డిజిటల్ మీడియా సులభంగా అందుబాటులో వుండేవారిలో ఏకాగ్రత బాగా తగ్గిపోయిందని వెల్లడి అయ్యింది. అధ్యయనం ప్రకారం మానవుని అటెన్షన్ సమయం సరాసరి 12 సెకండ్ల నుంచి 8 సెకండ్ల పడిపోయింది.
2000 సంవత్సరం నుంచి ఇది క్రమంగా పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం మనిషి అటెన్షన్ స్పాన్ గోల్డ్‌ఫిష్ కన్నా తక్కువగా ఉంది. ఈ తిరోగమనం అన్ని ఏజ్ గ్రూప్‌ల వారిలోనూ కనిపించిందని అధ్యయనకారులు తెలిపారు.