నేటి బిజీ జీవితంలో చాలామంది రాత్రిపూట కడుపు నిండా భోజనం చేసేసి గుర్రుపెట్టి నిద్రపోతుంటారు. కానీ అలా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత నిదానంగా కనీసం వంద అడుగులైనా నడవాలి. దీనివల్ల త్వరగా భుజించిన ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు వీలు కలుగుతుంది. మెడ, మోకాళ్లు, నడుము మొదలగు అవయవాలకు పని దొరుకుతుంది.
రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎనిమిది ఉచ్వాసనిచ్వాసాలు కలిగే వరకూ వెల్లకిలా పడుకోవాలి. తర్వాత 16 ఉచ్వాస, నిచ్వాసాలు వచ్చేవరకూ కుడి ప్రక్కకు తిరిగి పడుకోవాలి. ఆ తర్వాత 32 ఉచ్వాస, నిచ్వాసాలు కలిగే వరకూ ఎడమవైపుకి తిరిగి పడుకోవాలి. ఆ తర్వాత ఎలా నిద్రపడితే అలా పడుకోవచ్చు. నాభి పైన ఎడమవైపు జఠరాగ్ని ఉంటుంది కనుక తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవడం జరుగుతుంది. నిద్రపోయేందుకు అనుకూలమైన స్థలమును ఎన్నుకోవాలి. మంచి గాలి వచ్చేట్లు ఉండాలి.