వేసవిలో మనకు లభించే పండ్లలో రేగు పండ్లు కూడా వుంటాయి. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా వున్నాయి. శరీరానికి చక్కటి పోషకాలు కావాలంటే రేగు పండ్లను తినాల్సిందే. రేగు పండ్లలో కొన్ని రకాలున్నాయి. వీటిలో చిన్న రేగు పండ్లు పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి.
అలాగే ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా వుండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినడం మంచిది. కీళ్ల వాపులు, నొప్పులూ ఉన్నవారు సైతం ఈ పండ్లు తింటే మంచిది.