ఒబిసిటీ, షుగర్ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. కందగడ్డ తీసుకోండి

శుక్రవారం, 26 మే 2017 (10:14 IST)
కందగడ్డ ఓ అద్భుతమైన.. బలమైన ఆహారం. ఇందులో విటమిన్ ఏ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కందలో పొటాషియం, ఫైబర్ నేచురల్ షుగర్స్ చాలా తక్కువ కేలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. ఇక గర్భిణులకు చేసే మేలు అంతా ఇంతా కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని, రోగ నిరోధకతని ఇస్తుంది. కందలను తీసుకోవడం వలన జీర్ణశక్తి వేగమవ్వడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా అధికమవుతుంది. 
 
కేన్సర్ బారిన పడకుండా కాపాడమే కాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు కంద ఓ దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చిన్న కంద గడ్డ ద్వారా మన శరీరానికి దాదాపు ఆరు గ్రాముల ఫైబర్ చేరుతుంది. వీటిని తినడం వలన ఒబిసిటీ, షుగర్ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి