ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కార్తీక దీపం, ఎలాగో తెలుసా?

సోమవారం, 16 నవంబరు 2020 (21:40 IST)
కార్తీకమాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీపారాధన వల్ల వచ్చే పుణ్యం సంగతి పక్కన పెడితే, దీనివల్ల దేహానికి కలిగే ప్రయోజనం కూడా ఉందని ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
   
'దీపం జ్యోతిః పరబ్రహ్మం, దీపం సర్వ తమోపహం,
దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే'
 
దీపపు జ్యోతీ పరబ్రహ్మ స్వరూపం. దీపం అన్ని విధములైన చీకట్లను తొలిగిస్తుంది. దీపారాధన అన్నింటినీ సాధించి పెడుతుంది. అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నానని పై శ్లోకం అర్ధం. ఒక్కో దీపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆవు నేతితో వెలిగించిన దీపపు కాంతిని రోజు కనీసం ఒక గంట సమయం అయిన చిన్న వయస్సు నుండి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు. 
 
నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజు కనీసం ఒక గంట పాటు కంటి మీద పడితే కంట్లో శుక్లాలు రావు. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కంటి దృష్టిని మెరుగుపరుస్తాయి. పూజా సమయంలో దీపం వెలిగించడం చేత ఈ కిరణాలు మన కంటిలోనికి ప్రవేశించి, కళ్ళకు మేలు చేకూర్చుతాయి.
 
ఒక గది మధ్యలో ఆవు నేతి దీపం వెలిగించి, హృద్రోగులు - రక్తపోటుతో బాధపడేవారు, ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే వారు రోజు ఒక గంట సమయం కనుక ఆ దీపం దగ్గర కూర్చొని చూస్తే కొద్ది రోజులలోనే వారికి ఆరోగ్యం మెరుగుపడుతుందని, రక్తపోటు అదుపులో ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు