గట్టిగా నవ్వితే తప్పులేదు.. బీపీ కంట్రోల్‌లో వుంటుంది తెలుసా?

బుధవారం, 18 డిశెంబరు 2019 (13:06 IST)
నవ్వు వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ సారి పరిశీలిద్దాం.. నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్పిస్ విడుదల అవుతుంది. నిత్యం నవ్వుతూ వుండే వారికి జీర్ణశక్తి పెరుగుతుంది. మానసిక రోగాలను నయం చేయడానికి నవ్వు ఔషంధం పనిచేస్తుంది. నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడ నొప్పి సమస్య వుండదు. 
 
నవ్వడం ద్వారా శరీరంలోని 108 కండరాలు ఉత్తేజితమవుతాయి. గట్టిగా నవ్వేవారిలో బీపీ అదుపులో ఉంటుంది. మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీలు కరిగిపోతాయి. గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు