మైదా పిండి వద్దే వద్దు.. పరోటాలు లాగిస్తే అంతే సంగతులు...
మంగళవారం, 17 అక్టోబరు 2017 (13:33 IST)
మైదా పిండితో చేసిన వంటకాలను తరచూ తింటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలి. జీర్ణం కావాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ వుండాలి. లేదంటే కడుపులోని పేగులు దెబ్బతింటాయి. అయితే ఫైబర్ లేని మైదాపిండిని తీసుకుంటే మాత్రం జీర్ణ వ్యవస్థకు కష్టాలేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మైదా పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక పేవులకు అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. తద్వారా దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి.
మైదాపిండి వంటకాల ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మైదా పిండితో చేసే పరోటాలు ఇతరత్రా వంటకాలను తరచూ లాగిస్తే బరువు పెరగడమే కాకుండా.. పొట్టకూడా పెరిగిపోతుంది. మైదాలో క్లైకమిక్ ఇండెక్స్ ఎక్కువగా వుండటం వల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
గోదుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ప్రస్తుతం బేకరీ, హోటల్ ఫుడ్స్‌లో అధికంగా వాడుతున్నారు. కాబట్టి హోటల్ ఫుడ్ తీసుకోకపోవడం చాలామటుకు ఆరోగ్యానికి మేలు చేసినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.