మిరపకాయలు వారంలో నాలుగుసార్లు తప్పక తీసుకోవాలట..

గురువారం, 19 డిశెంబరు 2019 (11:29 IST)
మిరపకాయలు కారం కారం అంటూ పక్కనబెట్టేస్తున్నారా..? అయితే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే. మిరపకాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వుండవని ఇటలీ పరిశోధనలో వెల్లడి అయ్యింది. అందుచేత రోజుకు రెండేసి మూడేసి మిరపకాయలను వంటల్లో తప్పక చేర్చుకోవాలని పరిశోధకులు చెప్తున్నారు. 
 
మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గించే ‘క్యాప్‌సేసియన్‌’ అనే పదార్థం ఉంటుందని దీని వల్ల గుండెకు రక్షణ కలుగుతోందని ఇటలీ పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలను‘అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు. భోజనంలో భాగంగా వారానికి నాలుగుసార్లు మిరపకాయలు తింటే గుండె పోటు ముప్పు 40 శాతం తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు.
 
దాదాపు 23 వేల మందిపై జరిగిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయ్యింది. వారానికి నాలుగుసార్లు ఆహారంలో మిరపకాయలను తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తక్కువగా ఉందని వారు గుర్తించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు