నేరేడు ఆకుల రసంతో రోజూ నోటిని పుక్కిలిస్తే..?

సోమవారం, 17 డిశెంబరు 2018 (13:24 IST)
నేరేడు ఆకుల రసంతో రోజూ నోటిని పుక్కిలిస్తే నోటిపూత, చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని రోజూ పుక్కిలిస్తే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు పండ్లు మధుమేహ బాధితులకు దివ్యౌషధం. ఈ గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకుని రోజు నీళ్లల్లో కలుపుకుని తాగితే శరీరంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి. 
 
నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. నేరేడు పండ్లు జీర్ణశక్తిని పెంచేందుకు తోడ్పడతాయి. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే.. రోజూ రెండేసి నేరేడు పండ్లను తీసుకోవాలి.
 
ఈ నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా వుంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా చలికాలంలో కాలంలో వీటిని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు