ఓట్స్‌ తీసుకోండి.. కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టండి..

గురువారం, 26 జులై 2018 (12:24 IST)
ఓట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే వారానికి రెండుసార్లైనా ఓట్స్ పిండిని ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఓట్స్ పిండిలో నీటిలో కరిగే పీచు పుష్కలంగా ఉంటుంది. ఈ పీచుపదార్థాన్ని బీటా గ్లూకన్ అంటారు. ఇది ఎక్కువ పరిమాణంలో ఉండటం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.


ఓట్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు వాడితే... మనం తినే పిండిపదార్థాలలోని చక్కెర నెమ్మదిగా రక్తంలో కలిసేలా ఈ ఫైబర్ నియంత్రిస్తూ ఉంటుంది. 
 
ఓట్స్‌లోని పిండిపదార్థాల్లో ఉండే పాలీ శాకరైడ్స్ ఆకలిని పెంచవు. తద్వారా పరిమితంగా ఆహారం తీసుకోగలుగుతారు. దీంతో ఒబిసిటీ దూరం అవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో కలిసే చక్కెర పాళ్లు గణనీయంగా తగ్గుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు రోజుకో పూట ఓట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు