గసగసాలతో పాయాసమా.. ఎలా చేయాలో చూద్దాం..

బుధవారం, 25 జులై 2018 (14:04 IST)
గసగసాలు శ్వాస సంబంధిత రుగ్మతలు తగ్గించే సామర్థ్యాన్ని కలిగిఉంటాయి. దగ్గు, దీర్ఘకాలిక ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమి సమస్యలను తొలగించుటలో గసగసాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇలాంటి గసగసాలతో పాయాసం ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
గసగసాలు - 3 స్పూన్స్
బియ్యం - 2 స్పూన్స్
బెల్లం - అరకప్పు
కొబ్బరితరుము - అరకప్పు
నీళ్లు - 1 కప్పు 
యాలక్యాయలు - 2
 
తయారీవిధానం:
ముందుగా బాణలిలో గసగసాలు, బియ్యం వేగించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత గ్రైండ్ చేసుకోవాలి. మళ్లీ కొబ్బరి తురుము, యాలక్కాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో బెల్లం, కొద్దిగా నీరు వేసుకుని ఉడికించుకోవాలి. మిశ్రమం ఉడికేటప్పుడు మధ్యమధ్యలో గరిటెతో కలుపుకోవాలి. కాస్త చిక్కనైన తరువాత దించేయాలి. అంతే గసగసాలు పాయాసం రెడీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు