పాదాల పగుళ్ళ నివారణకు గృహ వైద్యం...

బుధవారం, 25 జులై 2018 (15:42 IST)
చాలామంది తమ పాదాల సంరక్షణపై పెద్దగా శ్రద్ధ చూపించరు. ఫలితంగా పాదాలకు ఎక్కువ మురికి చేరి పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఈ పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి, వాచి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. ఫంగల్‌ ఇన్‌ ఫెక్షన్‌ కూడా దారి తీస్తాయి.
 
ఇలాంటి పగుళ్లు చాలా నిరాశనీ, అసహనాన్ని కలిగిస్తుంటాయి. తగినంత తేమ లేకపోవడం, ఎక్కువగా తడిలో పాదాలు నానుతుండడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. పైగా, ఇలాంటి పాదాలను చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కూడా. ఈ తరహా సమస్యకు ఇంటిపట్టునే చిన్నపాటి నివారించుకోవచ్చని గృహవైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
* కొవ్వొత్తి మైనాన్ని ఆవనూనెతో కలిపి రాత్రిపూట పాదాల పగుళ్లపై రాస్తే తెల్లవారే సరికి కొంత ఫలితం కన్పిస్తుంది. 
* గ్లిజరిన్‌ను రోజ్‌ వాటర్‌తో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి ముందు పాదాల పగుళ్లపై రాయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. 
* నిద్రించే ముందు పాదాలకు నువ్వులనూనెను మర్ధన చేయడం కూడా మంచిదే. 
* అరటిపండు గుజ్జు కూడా ఈ పగుళ్ల నివారణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. 
* పసుపు, తులసి, కర్పూరం సమాన మోతాదులో తీసుకుని, వీటికి అలోవెరా జెల్‌ కలిపి పాదాల పగుళ్లకు రాసి చూస్తే మంచి ఫలితం ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు