స్త్రీలకు చీటికిమాటికి వళ్లు నొప్పులు ఎందుకు వస్తాయి?

గురువారం, 22 సెప్టెంబరు 2016 (17:18 IST)
స్త్రీలలో చాలా మందికి చీటికి మాటికి వళ్లు నొప్పులు వస్తుంటాయి. జలుబు చేస్తూ ఉంటుంది. వీటితో పొద్దస్తమానం బాధపడుతుంటారు. నిజానికి స్త్రీలకు ఇలాంటి నొప్పులు ఎందుకు వస్తుంటాయి. 
 
సాధారణంగా జలుబు నొప్పులకు కారణం శరీర భంగిమలకు సంబంధించిన కండరాలలో, మానసిక భావోద్వేగాల కారణంగా తీవ్రమైన సంకోచాలు ఏర్పడటం, ఈ కండరాలు తల, మెడ, వెన్నెముకలతో అనుసంధానితమై ఉంటాయని, మానసిక ఆందోళన, టెన్షన్స్ కారణంగా ఏర్పడే కండర సంకోచాలే ఈ నొప్పులకు కారణమని వైద్యులు చెపుతున్నారు. 
 
తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు పరిసరాలతోనూ, వాస్తవ జీవన విధానాలతోనూ మానసికంగా సర్దుబాటు చేసుకోకపోవడం వల్ల కలిగే టెన్షన్‌తో వస్తాయి. యాంగ్జైటీ, డిప్రెషన్ కారణంగా కూడా కొన్ని రకాల నొప్పులు వస్తుంటాయిని, ఇలాంటి వాటిని సైకో న్యూరోసిస్‌ నొప్పులుగా పేర్కొంటారని చెపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి