అలాగే ఆరెంజ్ పండ్లను తినడం ద్వారా కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని తెలిసింది. ఆరెంజ్‌లో ఉండే కెరోటినాయిడ్ అని పిలిచే విటమిన్ ఏ కాంపౌండ్స్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఆరెంజ్‌లో లిమోనాయిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ, ఊపిరితిత్తుల, రొమ్ము, కడుపు, ప్రేగు క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ రకాల మీద పోరాటానికి సహాయపడుతుంది.