బొప్పాయి పండ్ల ముక్కలను తేనెలో కలిపి తీసుకుంటే?

శనివారం, 29 డిశెంబరు 2018 (17:02 IST)
బొప్పాయిని అన్నీ సీజన్లలో తీసుకోవచ్చు. ఈ పండులో పోషకాలు పుష్కలం. కిడ్నీలోని రాళ్లు తొలగిపోవాలంటే.. రోజూ ఒక కప్పు బొప్పాయి పండ్ల ముక్కల్ని తీసుకోవాలి. నరాల బలహీనతకు బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నెలసరి సమస్యలను దూరం చేస్తుంది. 
 
రోజూ అరకప్పు బొప్పాయి పండ్ల ముక్కలను తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పిల్లలకు రోజు పావు కప్పు బొప్పాయి ముక్కలను ఇవ్వడం ద్వారా పిల్లల్లో పెరుగుదల వుంటుంది. ఎముకలు బలపడతాయి. 
 
దంత సమస్యలు వుండవు. బొప్పాయి ముక్కలను రోజూ తీసుకుంటే.. ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. బొప్పాయి పండ్లను తేనెలో కలిపి తీసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు