మనం నిత్యం వాడుకునే కూరగాయల్లో బెండకాయ ఒకటి. ఇది అనేక రకములైన పోషక విలువలను కలిగి ఉంది. బెండకాయ మాంసకృత్తులు, పీచుపదార్దాలు, ఫోలెట్, కాల్షియం మొదలైన వాటిని కలిగి ఉంది. వీటితో పాటు బెండకాయలో మెగ్నీషియం, సోడియం, పొటాషియం, రాగి, మాంగనీసు, జింక్ లాంటివి సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. దీనివలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
3. బెండ పైత్యాన్ని తగ్గిస్తుందని, వాతాన్ని నివారిస్తుందని, వీర్య వృద్ధి చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
6. దీనిలో ఉండే పెక్టిన్.. బ్లడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బెండకాయల్లో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతో పాటు అయోడిన్ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్ వ్యాధి రాకుండా చేస్తుంది. బెండకాయలను కూరగాయగా, సలాడ్‌గా ఎండబెట్టి వరుగులను తయారుచేయడంలో వాడతారు.