గర్భిణీలు బొప్పాయిను తీసుకుంటే? ఆరోగ్యానికి?

శనివారం, 9 జూన్ 2018 (10:58 IST)
బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంటుంది. కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్స్, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.ఇన్ని సుగుణాలున్న బొప్పాయి పండు వల్ల ఇతర ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 
 
పెరడులో, ముంగిట్లో, తోటల్లో విస్తృతంగా లభించే బొప్పాయి శరీరాన్ని అదుపులో ఉంచే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఈ పళ్లు వేడి చేస్తాయి కనుక గర్భవతులకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పోషకతత్వాల వలన గర్భిణీలకే కాకుండా గర్భస్థశిశువుకు కూడా చాలా మంచిది. కనుక అందరూ నిర్భయంగా మిగిలిన అన్ని పండ్లనేకాకుండా బొప్పాయిని తీసుకుంటే మంచిది.
 
ఇందులో చక్కెర శాతం తక్కువ కనుక కొందరికి రుచించదు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు బొప్పాయాను ఆదర్శ భోజనంగా తీసుకుంటే వారికి ఇది ఒక మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. స్థూలకాయాన్ని తగ్గించేందుకు బొప్పాయి చాలా సహాయపడుతుంది. బొప్పాయిలో పాపైన్ అనే పేరున్న ఈ ఎంజైమ్ వలన జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు