రోజూ ఊరగాయలు, పచ్చళ్లు లేకుండా ముద్ద దిగదా..? అయితే చదవండి. పచ్చళ్లులు, ఊరగాయలు ఎంత తినాలో అంతే తినాలి. ఎందుకంటే.. వాటిలో ఉపయోగించే ఉప్పు, నూనె, వెనిగర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.
ప్యాక్ చేయబడిన ఊరగాయల్లో.. ఎక్కువ కాలం పాడవకుండా వుండేందుకు వీలుగా నూనె, ఉప్పు, వెనిగర్ ఎక్కువగా కలుపుతారు. ఇవి మధుమేహానికి దారితీస్తాయి. వీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. నిల్వ ఉంచిన ఊరగాయలు, పచ్చళ్లను తీసుకోవడం ద్వారా ఉదర భాగంగా అసౌకర్యంగా అనిపిస్తుంది.
అధిక మొత్తంలో నూనెలు, ఉప్పు, కారం వంటివి ఉండటం వలన జీర్ణాశయంలో సమతుల్యతను భంగానికి గురిచేసింది. అధికంగా ఉప్పు ఉండటం వలన కూడా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. ఎక్కువ మొత్తంలో సోడియాన్ని పచ్చళ్లు, ఊరగాయల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన నీటి శాతం కంటే ఎక్కువగా తీసుకోవాల్సి వుంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిల్వవుంచిన ఊరగాయలు, పచ్చళ్లు రక్తపోటు, అల్సర్లకు దారితీస్తాయి. అందుకే నిల్వ వుంచిన ఊరగాయలను ఎక్కువగా తీసుకోవడం మానేయండి. ఇంట్లో తయారు చేసిన ఊరగాయల్లోనూ నూనె, ఉప్పు, కారం తక్కువగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.