రోజూ ఓ కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే?

బుధవారం, 12 జులై 2017 (11:22 IST)
క్యాన్సర్, గుండెజబ్బు వంటి జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే.. పైనాపిల్ ముక్కలు రోజుకు ఒక కప్పు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే రోజు మొత్తంలో అవసరమైన విటమిన్ సి లభించినట్టే. దీంతో రోగనిరోధకశక్తి బాగా పుంజుకుంటుంది. కణజాలం వృద్ధి చెందటానికి పైనాపిల్ ముక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. 
 
ఇంకా వృద్ధాప్య ఛాయలు రానీయకుండా చేస్తాయి. ఇంకా పైనాపిల్ ముక్కలు బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పైనాపిల్‌తో కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు నయం అవుతాయి. దీనిలోని బ్రొమెలనిన్‌ అనే ఎంజైమ్‌ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి, అలాగే పైనాపిల్‌లో మాంగనీసు పుష్కలంగా ఉండటంతో పాటు విటమిన్ సి సైతం చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి