దానిమ్మ తొక్కలను ఎండబెట్టి ఉపయోగిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

బుధవారం, 16 ఆగస్టు 2023 (21:41 IST)
దానిమ్మ తొక్కలు తీసాక చాలామంది వాటిని పడేస్తుంటారు. అయితే అవి ఆయుర్వేద వైద్యంలో వివిధ ఆరోగ్య- సౌందర్య ప్రయోజనాల కోసం క్రమం తప్పకుండా ఉపయోగించబడుతున్నాయి. దానిమ్మ తొక్కలుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. దానిమ్మ రసం కంటే  దానిమ్మ తొక్కలులో 50 శాతం ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. దానిమ్మ తొక్కలను తీసి 2 లేదా 3 రోజులు నేరుగా సూర్యకాంతి ఉన్న కిటికీ దగ్గర ఉంచండి.
 
ఎండిన దానిమ్మ తొక్కలను బ్లెండర్ లేదా ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ దానిమ్మ పొడిని గది ఉష్ణోగ్రత వద్ద గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ దానిమ్మ పొడి కొన్ని చర్మ పరిస్థితులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
 
దానిమ్మ తొక్కలు గుండె జబ్బులు- మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలను అడ్డుకుంటాయి.
దానిమ్మ తొక్కల చూర్ణంతో మెదడు పనితీరును మెరుగుపరచవచ్చు. దానిమ్మ తొక్కలలో పునికాలాగిన్ అనే పాలీఫెనాల్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. దంత ఆరోగ్యాన్ని, గొంతు నొప్పిని తగ్గించడానికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు దానిమ్మ తొక్కలు సహాయపడుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు