శరీరంలోని టాక్సిన్లను తొలగించే ముల్లంగి రసం..

శనివారం, 15 ఏప్రియల్ 2017 (16:32 IST)
వేసవిలో ముల్లంగిని వారానికి ఓసారి తీసుకోవాలి. శరీరంలోని టాక్సిన్ల తొలగించడంలో భేష్‌గా పనిచేసే ముల్లంగిలో తీసుకోవడం ద్వారా శరీరంలోని మలినాలను తొలగించుకోవచ్చు. కానీ వేసవిలో ముల్లంగిని తీసుకోవడం ద్వారా అదనంగా అధికంగా నీరును సేవించాల్సి వుంటుంది. ముల్లంగిలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. 
 
వాత సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవాలంటే.. వారానికి రెండు సార్లు ముల్లంగి రసాన్ని సేవించాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ముల్లంగిని ఉడికించి, పచ్చిగా తీసుకోవడం కంటే రసాన్ని సేవించడం ద్వారా అందులోని పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కిడ్నీ, కాలేయ సమస్యలను ముల్లంగి సులభంగా తొలగిస్తుంది. వ్యాధికారక క్రిములను తొలగించి వెలివేయడంలోనూ ముల్లంగి మెరుగ్గా పనిచేస్తుంది.
 
ముల్లంగి రసంలో విటమిన్ ఎ, బీ6, సి, పొటాషియం, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, జింక్, మాంగనీస్ వంటివి ఉన్నాయి. ఇవి కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి